1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- March 15, 2023
యూఏఈ: అబుధాబిలో నివసిస్తున్న దిపిష్ అనే భారతీయ జాతీయుడు.. మార్చి 11న జరిగిన మహ్జూజ్ డ్రా 119వ వారపు డ్రాలో 1,000,000 దిర్హామ్ల రాఫిల్ బహుమతిని గెలుచుకున్నాడు. పెద్ద సూపర్ మార్కెట్ చైన్లో పనిచేస్తున్న ఈ 38 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్.. 14 సంవత్సరాల క్రితం యూఏఈ వచ్చాడు. ఇంతకుముందు మహ్జూజ్లో చిన్న బహుమతులను గెలుచుకున్నానని, కానీ ఇంత పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకోవడం నమ్మశక్యం కావడం లేదన్నారు. వచ్చిన బహుమతి మనీనుంచి కొంత భాగాన్ని తన ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకుంటానని తెలిపారు. అదే డ్రాలో 25 మంది ఇతర పార్టిసిపెంట్లు ఐదు నంబర్లలో నాలుగింటిని సరిపోల్చారు. రెండవ బహుమతి కింద Dh200,000 పంచుకున్నారు. ఒక్కొక్కరు Dh8,000 సంపాదించారు. 1,030 మంది ఇతర విజేతలు ఐదు సంఖ్యలలో మూడింటితో సరిపోల్చడంతో.. ఒక్కొక్కరు Dh250 అందుకున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..