రమదాన్ స్పెషల్: గ్లోబల్ విలేజ్ కొత్త టైమింగ్స్
- March 16, 2023
యూఏఈ: దుబాయ్ గ్లోబల్ విలేజ్ పవిత్ర రమదాన్ మాసానికి కొత్త సమయాలను ప్రకటించింది. సందర్శకులు ఇఫ్తార్, సుహూర్ సమయాలలో అతిథులకు వసతి సౌకర్యాలను కల్పించనుంది. ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు గ్లోబల్ విలేజ్ లో కుటుంబంతో కలిసి ఆనందించవచ్చు. పవిత్ర మాసంలో కొత్తగా ప్రత్యేక కార్యకలాపాలను కూడా ప్రకటించారు. ప్రధాన వేదికపై ప్రతి రాత్రి రెండుసార్లు ప్రదర్శించే అద్భుతమైన 30-ముక్కల అరబెస్క్ ఆర్కెస్ట్రా హైలైట్ గా నిల్వనుంది. అలాగే వయోలిన్ ప్లేయర్, లైట్‌షో కాలిడోస్కోప్‌లను అతిథిలు ఆస్వాదించవచ్చు.
గ్లోబల్ విలేజ్ ప్రపంచంలోని మజ్లిస్‌ను తిరిగి స్వాగతిస్తోంది. ఇక్కడ అతిథులు రమదాన్ సంప్రదాయాలను ఆస్వాదించవచ్చు. అతిథులు ఇఫ్తార్, సుహూర్ ఆర్డర్ చేయవచ్చు లేదా పార్క్ చుట్టూ ఉన్న 250+ డైనింగ్ ఆప్షన్‌లలో దేనిలోనైనా ఆహారాన్ని తీసుకోవచ్చు.
షాపింగ్
3,500+ షాపింగ్ అవుట్‌లెట్‌లతో ప్రత్యేకమైన రమదాన్ రుచులు, అలంకరణలను అతిథులు కొనుగోలు చేయవచ్చు. రమదాన్ గృహ ఉపకరణాల కోసం ఈజిప్ట్, టర్కీ, అల్ సనా పెవిలియన్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. సౌదీ అరేబియా, సిరియా,ఒమన్ పెవిలియన్లలో రుచికరమైన డేట్స్ తోపాటు స్వీట్లను రుచి చూడవచ్చు. యూఏఈ, యెమెన్, పాకిస్తాన్, కువైట్ మరియు బహ్రెయిన్ పెవిలియన్లు తమ రమదాన్ వంటకాలకు అవసరమైన సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులను ప్రత్యేక ధరలకే అందిస్తున్నాయి. గ్లోబల్ విలేజ్ ఏప్రిల్ 29 వరకు అతిథులను స్వాగతించనుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







