విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై

- May 05, 2016 , by Maagulf
విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై

విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు దిల్లీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఈ సేవలను ప్రారంభించారు. రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు ఎంతసేపైనా ఉచితంగా వైఫై సౌకర్యం పొందవచ్చని విజయవాడ డీఆర్‌ఎం అశోక్‌కుమార్‌ తెలిపారు. విజయవాడతో పాటు గుంటూరు, తిరుపతి రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు రైల్‌సెల్‌ అధికారులు తెలిపారు. నరేంద్రమోదీ చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వేస్టేషన్లలో ఉచిన వైఫై సేవలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com