రస్ అల్ ఖైమాలో జరిమానాలపై 50% తగ్గింపు
- March 17, 2023
యూఏఈ: అంతర్జాతీయ హ్యాపీనెస్ దినోత్సవం సందర్భంగా రస్ అల్ ఖైమాలో కొన్ని సాధారణ ఉల్లంఘనల జరిమానాలపై 50 శాతం తగ్గింపును ప్రకటించారు. రస్ అల్ ఖైమా పబ్లిక్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ (RAKPSD) ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేని పురస్కరించుకుని ఈ తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్చి 20 నుండి 22 వరకు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని తెలిపింది. పర్యావరణ ఉల్లంఘనలతో సహా RAKPSD పరిధిలోకి వచ్చే నేరాలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, నిషిద్ధ ప్రదేశాలలో ధూమపానం చేయడం, అలాగే ట్రక్కుల కోసం టోల్ గేట్ ఉల్లంఘనలు మొదలైనవి వాటికి తగ్గింపు ఆఫర్ వర్తిస్తుంది. UN ద్వారా స్థాపించబడిన అంతర్జాతీయ హ్యాపీనెస్ డేని మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







