మజూన్ మెకానికల్ సర్వీసెస్ యల్.యల్.సి(సి.ఈ.ఓ)తులసి ప్రసాద్ తో ముఖాముఖి

- May 06, 2016 , by Maagulf
మజూన్ మెకానికల్ సర్వీసెస్ యల్.యల్.సి(సి.ఈ.ఓ)తులసి ప్రసాద్ తో ముఖాముఖి

1)    స్వదేశంలో ఓ సాధారణ ఉద్యోగి నుండి విదేశంలో ఓ కంపెనీ అధినేతగా మీ ప్రస్థానం మరియు గల్ఫ్ దేశాల వైపు మీ ప్రయాణం ఎలా జరిగింది?
A)    ఉన్నతమైన విలువలు కలిగిన ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి అన్న నా passion నన్ను ఒక సాధారణ ఉద్యోగి నుండి ఒక కంపెనీకి అధినేతను చేసింది. లక్ష్యానికి షార్ట్ కట్స్ ఉండవు....హార్డ్ వర్క్ ఒక్కటే మార్గం అన్న సూత్రాన్ని ఆచరిస్తేనే విజయం వరిస్తుంది.
తిరుపతిలో పుట్టిన నేను చెన్నై వోల్టాస్ కంపెనీ లో ఉద్యోగంలో చేరాను. అక్కడి బ్రాంచ్ లోని   సీనియర్స్ కొందరు ఒమన్, దుబాయ్ వెళ్లి మంచి జీతంలో స్థిరపడడం, కొత్త ఎక్స్పోజర్ సంపాదించడం నాకు  ప్రేరణగా, స్పూర్తిగా ఉండేది. అప్పుడే అబ్రాడ్ వెళ్ళాలన్న ఆలోచన కలిగింది. అలా 2002 లో దుబాయ్ లోని ETA (M & E) కంపనీలో జాయిన్ అయ్యాను.
రెండు పెద్ద కంపెనీలలో పనిచేసిన నేను సొంత కంపెనీ స్టార్ట్ చేసేముందు ఒక చిన్న కంపెనీ లో చేరి కంపెనీ ని ఎలా రన్ చేయాలో తెలుసుకోగలిగాను. 
2006 లో మజూన్ మెకానికల్ సర్వీసెస్ సంస్థను స్థాపించడం జరిగింది. గత పది సంవత్సరాలుగా ఈ కంపెనీ నడిపిస్తున్నాం. నిజం చెప్పాలంటే ఆర్ధిక మాంద్యం సమయంలోనే కంపెనీ పురోగతి సాధించింది. భవిష్యత్తులో కంపెనీని ఇంకా విస్తరింపచేసి అభివృద్ధి పదంలో నడిపించే కోణంలో పనిచేస్తున్నాం.
2)    ఈ ప్రయాణంలో ముందుగా మీకు సహకరించిన వారు ఎవరు?
A)    ఈ ప్రయాణంలో నాకు సహకరించిన వారు ముందుగా నా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు. ఇంకా వోల్టాస్ లో పనిచేస్తున్న మా ఆపరేషన్స్ మేనేజర్ Mr. N.S Raghavan and Swaminathan. 
3)    దుబాయ్ లో ఉద్యోగం చేయడమే కష్టం, వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించగలిగారు?
A)    చదువుకునే రోజులనుండి ఒక గొప్ప Business Entrepreneur అవ్వాలనేది నా passion గా ఉండేది. వోల్టాస్ బ్రాంచ్ ఆఫీసు లో వర్క్ చేయడం కన్నా, ఏరియా ఆఫీసు లో వర్క్ చేయడం వలన కంపెనీ లోని అన్ని విభాగాలని హాండిల్ చేసే అవకాసం లభించింది. అదేవిధంగా దుబాయ్ నుండి ఖతార్ బ్రాంచ్ ఆఫీసు కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు స్వంతగా విదేశాలలో కూడా కంపెనీ రన్ చేయగలము అన్న confidence లభించింది. నా passion కి ఈ అనుభవం తోడవడం వల్ల 2006 లో సొంత కంపెనీ ని స్థాపించి విజయవంతం గా నడుపుతున్నాము. 
4)    ప్రతి మగవాడి విజయం  వెనక ఒక మహిళ ఉంటుంది. మీ జీవితభాగస్వామి నుండి మీరు అందుకున్న సహకారం ఎలాంటిది?
A)    నా జీవిత భాగస్వామి ప్రతిభారాణి కూడా మెకానికల్ ఇంజనీర్. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అవ్వడం వలన మా కంపెనీ మొదటిదశ లో ఆఫీసు వర్క్ తనే చూసుకునేది. Projects Designing, Quotations తయారు చేస్తూ తనవంతు సహాయం తను చేసేది. అందుకే ఇది మా అందరి విజయం.
5)    డబ్బు, పేరు సంపాదించినా సేవాగుణం అతి తక్కువ మందిలో ఉంటుంది. మీరు సేవారంగం వైపు మళ్ళడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు?
A)    ఒకరికి సహాయం చేయడం అనే గుణం చిన్నప్పటినుండి మా అమ్మగారి ద్వారా వచ్చింది. ఒక సాధారణ కుటుంబం లో నుండి రావడం వల్ల ప్రతిభ ఉండి, డబ్బులు లేక చదువుకోలేని పిల్లలతో కలిసి చదువు సాగించడం వల్ల వాళ్లకి సహాయం చేయాలన్న ప్రేరణ కలిగేది. ఒక ఉద్యోగిగా కొద్దిమందికే సహాయం చేయగలం. అదే ఒక వ్యాపారవేత్తగా ఎంతోమందికి ఉపాది కలిపించడం ద్వారా వాళ్ళ కుటుంబాలకి మరియు సమాజానికి ఉపయోగ పడగలమనే ఉద్దేశం కూడా వ్యాపార రంగం వైపు రావడానికి దోహదపడింది. భవిష్యత్తులో ఒక చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి ఆర్ధికంగా వెనుకబడిన విధ్యార్ధులను చదువుకోవడానికి ఉపాధి కల్పించాలన్నది నా ఆకాంక్ష.
6)    దుబాయ్ కి ఉద్యోగాలకోసం వచ్చే వారికి మీరు చెప్పే సలహా?
A)    జీవితంలో పైకిరావాలి అనుకునేవారికి, కష్టపడి పనిచేసేవారికి దుబాయ్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే ఏజెంట్స్ ని నమ్మి మోసపోకుండా సరైన వీసా లతో దుబాయ్ కి రావాలి.
7)    జీవితం లో గోల్ లేకుండా నిస్తేజంతో నిట్టూర్పులు విడిచే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
A)    అవకాశాలు లేవు అని నిస్తేజంతో ఉండిపోకుండా, వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, జీవితంలో ముందుకు సాగాలి. యువతకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే కెరీర్ మొదలుపెట్టినప్పుడు డబ్బు సంపాదించటం కంటే పని లో నైపుణ్యతను సాధించడం పై దృష్టి పెడితే అనతికాలంలోనే మీరు కోరుకునే డబ్బు, పరపతిని మీ నైపుణ్యతె మీకు తెచ్చిపెడుతుంది.
8)    మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి?
A)    హార్డ్ వర్క్ మరియు స్మార్ట్ ప్లానింగ్ అనే ఈ రెండు ఒక వ్యక్తీ యొక్క లేదా ఒక సంస్థ యొక్క విజయానికి చాలా ముఖ్యమైనవి. హార్డ్ వర్క్ తప్ప జీవితం లో ఏదైనా సాధించటానికి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవని నేను పూర్తిగా నమ్ముతాను.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com