గల్ఫ్‌లో తెలుగు మహిళల ఇక్కట్లు

గల్ఫ్‌లో తెలుగు మహిళల ఇక్కట్లు

‘ఖద్దమా’ వస్తేనే... లేదంటే చక్కర్లే!విజిటింగ్‌ వీసాలపైనే దుబాయికిట్రయల్‌ మెయిడ్స్‌గా అవతారంషేకులకు నచ్చినోళ్లకు వీసాలులేదంటే ఒక దేశం నుంచి మరో దేశానికి చక్కర్లుఒమన్‌లోని ఎంబసీలో 22 మంది మహిళలు పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళుతున్న తెలుగు మహిళలు ఆయా దేశాల్లో తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల మాయ మాటలకు ఆకర్షితులై... విజిటింట్‌ వీసాలపైనే విదేశాలకు వెళుతున్న మహిళలు ఆ తర్వాత తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రత్యేకించి గల్ఫ్‌ దేశాలకు వెళుతున్న తెలుగు మహిళలే ఈ తరహా ఇబ్బందులు పడుతున్నారు. కడ ప, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన మహిళలు గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి అమాయకత్వాన్ని ఆస రా చేసుకుంటున్న ముంబై ఏజెంట్లు సులువుగా లభించే దుబాయి విజిటింగ్‌ వీసాలిప్పించి వారిని విమానం ఎక్కించేస్తున్నారు. అక్కడికి వెళ్లాక దుబాయి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఒమన్‌ తదితర దేశాల్లో వారిని ట్రయల్‌ మెయిడ్స్‌గా అరబ్‌ షేకుల ఇళ్లల్లో పనికి కుదురుస్తున్నారు. తమ ఇళ్లల్లో ట్రయల్‌ మెయిడ్స్‌గా పనికి కుదిరిన తెలుగు మహిళల పనితీరు మెచ్చిన అరబ్‌ షేకులు వారిని ‘ఖద్దమా’ (పని మనిషి)గా గుర్తిస్తూ చట్టబద్ధ వీసా ఇప్పిస్తున్నారు. ఖద్దమా హోదా వస్తే.. సరేసరి. లేదంటే ఇక తెలుగు మహిళలకు ఇబ్బందులు మొదలైనట్లే. ఖద్దమా హోదా రాని తెలుగు మహిళలకు అక్కడికక్కడే ఒమన్‌ వీసా ఇప్పిస్తున్న ఏజెంట్లు దుబాయి నుంచి ఒమన్‌ తరలిస్తున్నారు. అక్కడా ఖద్దమా లభించకుంటే... తిరిగి అక్కడి నుంచి మస్కట్‌... అక్కడ ఖద్దమా రాకపోతే తిరిగి దుబాయి... ఇలా గల్ఫ్‌ దేశాల మధ్య తెలుగు మహిళలు చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో మహిళలు ఎక్కడికీ పారిపోకుండా ఏజెంట్లు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. దీంతో అటు ఉపాధి లభించక, ఇటు ఇంటికి రాలేక అక్కడ తెలుగు మహిళలు దినదినగండంగా బతుకు వెళ్లదీస్తున్నారు. అయితే ఇటీవల ధైర్యం చేసిన కొందరు మహిళలు ఏజెంట్ల చెరలో నుంచి బయటపడి భారత ఏంబసీని ఆశ్రయిస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా 70 మంది మహిళలు సాహసం చేసి సొంతూళ్లకు చేరారు. ఇక మస్కట్‌లోని భారత ఏంబసీలో సొంతూళ్లకు వచ్చేందుకు 22 మంది మహిళలు ఎదురుచూస్తున్నారు. వీరంతా కడప, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారే.


--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Back to Top