ఏప్రిల్ చివరి నాటికి చంద్రుడి ఉపరితలంపైకి రషీద్ రోవర్‌!

- March 19, 2023 , by Maagulf
ఏప్రిల్ చివరి నాటికి చంద్రుడి ఉపరితలంపైకి రషీద్ రోవర్‌!

యూఏఈ: యూఏఈ నిర్మిత రషీద్ రోవర్‌ను చంద్రునిపైకి తీసుకువెళుతున్న జపనీస్ లూనార్ ల్యాండర్ హకుటో-ఆర్ ను చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ముందు అన్ని అంతరిక్ష కక్ష్య నియంత్రణ విన్యాసాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు జపనీస్ మేకర్ ఇస్పేస్ శనివారం ప్రకటించింది. ల్యాండర్ ప్రస్తుతం చంద్రునికి దాని పథంలో స్థిరమైన కక్షలో తీరుగుతోందని, త్వరలోనే ల్యాండర్ చంద్ర గురుత్వాకర్షణ ప్రాంతంలోకి ప్రవేశించి చంద్రుని చుట్టూ కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్పేస్ వెల్లడించింది. ల్యాండింగ్ అనేది చంద్రుని మిషన్‌లో అత్యంత కీలకమైన భాగం. భారతదేశం, ఇజ్రాయెల్‌తో సహా అనేక దేశాలు చేపట్టిన మిషన్‌లు ఈ స్టేజీలోనే ఇంతకు ముందు విఫలమయ్యాయి. రషీద్ రోవర్ ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి చంద్రుడి ఉపరితలంపై దిగే అవకాశం ఉంది. హకుటో-ఆర్(Hakuto-R) ను స్పెస్ ఎక్స్ (SpaceX) ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2022 డిసెంబర్ 11న కేప్ కెనావెరల్ నుండి విజయవంతంగా ప్రయోగించారు.

రోవర్ మిషన్

రషీద్ రోవర్ ఒక అరబ్ దేశం నిర్మించిన మొదటి మూన్ రోవర్. దుబాయ్ మాజీ పాలకుడు దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ పేరు పెట్టబడిన యూఏఈ నిర్మిత మూన్ రోవర్ చంద్రుని పరిసరాలను అధ్యయనం చేయనుంది. రషీద్ రోవర్‌లో మైక్రోస్కోపిక్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాతో సహా నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటితో చంద్రుని ఉపరితలంపై నేల, దుమ్ము, రేడియోధార్మిక, విద్యుత్ కార్యకలాపాలు,  రాళ్లను అధ్యయనం చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com