సైకిల్ తొక్కుతుండగా.. కారు ఢీకొని టీచర్‌ మృతి

- March 19, 2023 , by Maagulf
సైకిల్ తొక్కుతుండగా.. కారు ఢీకొని టీచర్‌ మృతి

యూఏఈ: అబుధాబిలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కైనా హీలీ(38) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం ఉదయం 6 గంటలకు సైకిల్ తొక్కుతుండగా అజ్బాన్ బ్రిడ్జిపై అల్ రహ్బా వద్ద కారు ఢీకొనడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా కైనా హీలీ 3 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు ఫుట్‌బాల్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, నెట్‌బాల్, బాస్కెట్‌బాల్, ట్రయాథ్లాన్‌లను నేర్పుతారని ప్రిన్సిపాల్ అడ్రియన్ ఫ్రాస్ట్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com