సౌదీలో ఏటా రెండుసార్లు ఫార్ములా 1 రేసులు!
- March 19, 2023
జెడ్డా: సౌదీ అరేబియా ఫార్ములా 1లో ఏటా 2 రేసులను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని సౌదీ ఆటోమొబైల్, మోటార్ సైకిల్ ఫెడరేషన్ (SAMF) ప్రెసిడెంట్ ప్రిన్స్ ఖలీద్ బిన్ సుల్తాన్ అల్-అబ్దుల్లా అల్-ఫైసల్ తెలిపారు. ఇది వెంటనే అమల్లోకి రాకున్న సమీప భవిష్యత్తులో వాస్తవ రూపం దాల్చవచ్చని, కింగ్‌డమ్‌లో 2 రేసులను నిర్వహించే ఆలోచన సాధ్యమేనని ఆయన అన్నారు. సౌదీ అరేబియా రియాద్‌కు సమీపంలోని ఖిద్దియా నగరంలో నిర్మించిన కొత్త సర్క్యూట్ 2027లో పూర్తవుతుందని, జెడ్డా కార్నిచ్ సర్క్యూట్‌తో పాటు ఫార్ములా 1కి ఆతిథ్యమిచ్చే రెండో సర్క్యూట్ అందుబాటులోకి వస్తుందన్నారు. అమెరికాలో 3 రేస్‌లు ఉన్నాయని, అక్కడ విపరీతమైన మార్కెట్‌తో పాటు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. సౌదీ అరేబియాలో కూడా ఫార్ములా 1కి డిమాండ్ ఉందని ప్రిన్స్ ఖలీద్ తెలిపారు. సమీప భవిష్యత్తులో సౌదీ అరేబియా మరో రేసును నిర్వహించినా ఆశ్చర్యపోనవసరం లేదని, డిమాండ్ ఉన్నందున, రాజ్యం రెండు అద్భుతమైన సర్క్యూట్‌లను కలిగి ఉందని ఆయన అన్నారు. సౌదీ అరేబియా నిర్వహిస్తున్న అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఫార్ములా 1 అని అతను పేర్కొన్నారు. జెడ్డా కార్నిచ్ సర్క్యూట్‌లో వరుసగా మూడోసారి ఎస్టీసీ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ — ఫార్ములా 1 2023 రేసును మార్చి 17, 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!