సౌదీలో ఏటా రెండుసార్లు ఫార్ములా 1 రేసులు!
- March 19, 2023జెడ్డా: సౌదీ అరేబియా ఫార్ములా 1లో ఏటా 2 రేసులను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని సౌదీ ఆటోమొబైల్, మోటార్ సైకిల్ ఫెడరేషన్ (SAMF) ప్రెసిడెంట్ ప్రిన్స్ ఖలీద్ బిన్ సుల్తాన్ అల్-అబ్దుల్లా అల్-ఫైసల్ తెలిపారు. ఇది వెంటనే అమల్లోకి రాకున్న సమీప భవిష్యత్తులో వాస్తవ రూపం దాల్చవచ్చని, కింగ్డమ్లో 2 రేసులను నిర్వహించే ఆలోచన సాధ్యమేనని ఆయన అన్నారు. సౌదీ అరేబియా రియాద్‌కు సమీపంలోని ఖిద్దియా నగరంలో నిర్మించిన కొత్త సర్క్యూట్ 2027లో పూర్తవుతుందని, జెడ్డా కార్నిచ్ సర్క్యూట్‌తో పాటు ఫార్ములా 1కి ఆతిథ్యమిచ్చే రెండో సర్క్యూట్ అందుబాటులోకి వస్తుందన్నారు. అమెరికాలో 3 రేస్‌లు ఉన్నాయని, అక్కడ విపరీతమైన మార్కెట్‌తో పాటు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. సౌదీ అరేబియాలో కూడా ఫార్ములా 1కి డిమాండ్ ఉందని ప్రిన్స్ ఖలీద్ తెలిపారు. సమీప భవిష్యత్తులో సౌదీ అరేబియా మరో రేసును నిర్వహించినా ఆశ్చర్యపోనవసరం లేదని, డిమాండ్ ఉన్నందున, రాజ్యం రెండు అద్భుతమైన సర్క్యూట్లను కలిగి ఉందని ఆయన అన్నారు. సౌదీ అరేబియా నిర్వహిస్తున్న అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఫార్ములా 1 అని అతను పేర్కొన్నారు. జెడ్డా కార్నిచ్ సర్క్యూట్లో వరుసగా మూడోసారి ఎస్టీసీ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ — ఫార్ములా 1 2023 రేసును మార్చి 17, 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..