సౌదీ లో పెళ్ళైన ఐదోరోజుకే విడాకులు కోరిన మహిళ
- May 06, 2016
ఓ ముస్లిం మహిళ పెళ్లైన ఐదో రోజే భర్తకు విడాకులిచ్చేసింది. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. సౌదీకి చెందిన ఓ మహిళకు ఇటీవల వివాహమైంది. భర్త ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఐదు పూటలా నమాజ్ చేయడంలేదని, అందుకని తనకి విడాకులు కావాలని పెళ్లైన ఐదోరోజునే ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆమె పిటిషన్‌ను న్యాయస్థానం అంగీకరించి విడాకులు మంజూరు చేసింది. భర్తకు 55,000 సౌదీ రియాల్(సౌదీ కరెన్సీ) చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.
అసలే ఇస్లామిక్ చట్టాలను ఆచరించడంలో సౌదీ ముందుంటుంది. అలాంటిచోట ఈ ఘటన జరగడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తోంటే, మరి కొందరు ఇంత చిన్న విషయానికే విడాకులా అంటూ విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







