సౌదీలో హైదరాబాదీ యువతి మృతి

సౌదీలో హైదరాబాదీ యువతి మృతి

బతుకుదెరువు కోసం నగరం నుంచి సౌదీ వెళ్లిన 25 ఏళ్ల యువతి అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఇంటి పని నిమిత్తం సౌదీ వెళ్లిన దబీర్‌పురాలోని షాహ్ కాలనీకి చెందన అష్మియా ఖాటూన్‌ను అనారోగ్యం అంటూ ఆస్పత్రిలో చేర్చారు. కింగ్ సౌద్ చెస్ట్ డిసీసెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఆమె మరణించింది. వేధింపుల వల్ల శరీరంపై తీవ్రమైన గాయాలతోనే ఆమె చనిపోయిందని వార్తలొస్తున్నాయి. అష్మియా మరణవార్త గురించి ఆసుపత్రి వర్గాలు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపాయి. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించాల్సిందిగా సౌదీకి తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రత్యేక లేఖ రాశారు. గతేడాది 2015లో ఆమె నగరం వీడి సౌదీ వెళ్లింది. గత రెండేళ్లుగా సౌదీకి ఇంటిపని నిమిత్తం జారీ చేసే వీసాలను నిషేధించినా ఆమెను బిజినెస్ వీసాపై అక్రమంగా సౌదీ పంపించారని విచారణలో తేలింది. వెళ్లిన రెండు నెలలవరకూ ఆమె నుంచి ఎటువంటి ఫోన్ రాలేదనీ, ఆ తర్వాత ఒకరోజు ఫోన్ చేసి యజమాని తీవ్రంగా హింసిస్తున్నారనీ, చేతిపై వాతలు పెడుతున్నారని వాపోయిందని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. సౌదీలోని యజమాని అబ్దుల్ రెహ్మాన్ అలీ మహమ్మద్‌ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత మళ్లీ ఇన్ని రోజులకు ఆమె మరణవార్త గురించి సౌదీ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది.

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Back to Top