కొవిడ్ పేషెంట్లకు చికిత్సలో యాంటీ బయాటిక్స్ వాడొద్దు: కేంద్రం
- March 21, 2023
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప యాంటీబయోటిక్స్ వాడొద్దని సూచించింది. కొన్ని పరిస్థితుల్లో యాంటీబయోటిక్స్ ను నివారించడం కీలకమని పేర్కొంది.
మరోవైపు కోవిడ్ బారిన పడిన పెద్దల చికిత్సకు లొపినావిర్-రిటోనావిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఐవెర్మెక్టిన్, మోల్నుపిరవిర్, ఫావిపిరావిర్, అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ ఔషధాలు వినియోగించవద్దని ఆదేశాలిచ్చింది. ప్లాస్మా థెరఫీ కూడా చేయవద్దని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాధి తీవ్రత మధ్యస్తంగా లేదా తీవ్రంగా ఉంటే, రోగి ఆక్సిజన్ సహాయంతో ఉంటే ఐదు రోజుల పాటు రెమెడిసివిర్ వాడొచ్చని పేర్కొంది. అయితే వ్యాధి లక్షణాలు ప్రారంభమైన 10 రోజుల్లోపే వినియోగించాలని, ఐఎంవీ, ఎక్మో మీద ఉన్న వారికి ఇవ్వొద్దని సూచించింది. ఐసీయూలో చేర్చిన 24-48 గంటల్లో టోసిలిజుమాబ్ వినియోగించవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







