టర్కీ, సిరియాలకు 4 వేల ఫిఫా-22 క్యాబిన్లు
- March 21, 2023
అంకారా: ఫిఫా 2022 ప్రపంచ కప్ ఫుట్ బాల్ సందర్భంగా అభిమానుల కోసం వినియోగించిన 4,000 క్యాబిన్లను టర్కీ, సిరియాలో భూకంపం నుండి బయటపడిన వారి కోసం పంపినట్లు ఖతార్ అధికారులు వెల్లడించారు. అరేబియా గల్ఫ్‌లోని కార్గో షిప్లో తాజా బ్యాచ్ ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ క్యాబిన్లను లోడ్ చేసి పంపించారు. ఖతార్ డెవలప్మెంట్ ఫండ్ గత నెలలో క్యాబిన్ల షిప్పింగ్ ను ప్రారంభించింది. ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం కారణంగా నిరాశ్రయులైన మొత్తం 10,000 మందికి ఆశ్రయం కల్పించే ఉద్దేశంలో క్యాబిన్ ల తరలింపును ఖతార్ చేటట్టిందని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది చివర్లో జరిగిన ఫుట్‌బాల్‌లో అతిపెద్ద టోర్నమెంట్ సందర్భంగా దేశంలోకి వచ్చిన 1.4 మిలియన్ల మంది అభిమానులలో కొందరికైనా ఈ విధంగా సహాయం ధన్యవాదాలు తెలిపే అవకాశం వచ్చిందన్నారు. ఈ రంగుల క్యాబిన్లలో ఇక ఫ్యామిలీ ఉండేలా నిర్మించారు. ఎయిర్ కండిషనింగ్, టాయిలెట్, షవర్ ఏర్పాట్లు ఉంటాయి. ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలోని కొన్ని ప్రాంతాలలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 52,000 మందికి పైగా మరణించారు. టర్కీలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో 200,000 కంటే ఎక్కువ భవనాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!







