వేసవి తాపాన్ని తట్టుకోవడంలో ‘సబ్జా’ గింజల పాత్ర గట్టిదే సుమా.!

- March 21, 2023 , by Maagulf
వేసవి తాపాన్ని తట్టుకోవడంలో ‘సబ్జా’ గింజల పాత్ర గట్టిదే సుమా.!

వేసవి వచ్చేసింది. తాపం తట్టుకోవడానికి అనేక రకాల జాగ్రత్తలు తీసుకోక తప్పదు. లేదంటే, డీ హైడ్రేషన్‌కు గురి కావల్సి వస్తుంది. వేసవిలో వాతావరణంలో ఉష్ణోగ్రతతో పాటూ, శరీరంలోనూ అధిక ఉష్ణోగ్రతలుంటాయ్.

శరీరంలోని వేడిని తగ్గించి, ఒంటిని చల్లబరిచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయ్ సబ్జా గింజలు. డీహైడ్రేషన్ బారిన పడకుండా వుంచేందుకు తోడ్పడతాయ్.

వీటిని వట్టిగా తినకూడదు. వాటర్‌లో నానబెట్టి తాగాలి. రుచి కోసం కాస్త నిమ్మకాయ, కొద్దిగా షుగర్, సాల్ట్ వేసుకుని తీసుకుంటే షరబత్ మాదిరి రుచికి రుచి, శరీరానికి రోజుకు సరిపడా శక్తి లభిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటూ, అనవరసరమైన కొవ్వును కరిగించడంలోనూ సబ్జా గింజలు మేలు చేస్తాయ్.

వీటిలో ఫైబర్, విటమిన్ ఎ, ఐరెన్ ఎక్కువగా వుండడంతో, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయ్.

అలాగే, కడుపులో ఉబ్బరంగా వుండడం (ఎసిడిటీ) వంటి అజీర్తి సమస్యలకూ సబ్జా గింజలు చాలా మంచివి. 

చక్కెర లేకుండా తీసుకుంటే, షుగర్ వ్యాధిగ్రస్తులకూ సబ్జా గింజలు వరమే సుమా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com