మహారాష్ట్రలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..
- March 26, 2023
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ జరుగనుంది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో జరుగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో బయల్దేరి నాందేడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బహిరంగ సభ జరిగే కంధార్ లోహాకు బస్సులో చేరుకుంటారు.
ఇక కంధార్ లోహా పట్టణంలో 18 ఎకరాల్లో బహిరంగ సభ వేదికతోపాటు తాత్కాలిక షెడ్డుల నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సభా వేదికతోపాటు 50 వేల నుంచి 70 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, డేరాలతోపాటు వేసవికాలం నేపథ్యంలో కూలర్లను సైతం అమర్చారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహా పట్టణాలు గులాబీమయం అయ్యాయి. కంధార్ తోపాటు లోహా పట్టణానికి వెళ్లే మార్గాలన్నీ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్స్, తోరణాలతో గులాబీమయంగా మారాయి.
బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసి స్థానిక నాయకులతో కలిసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఆదివారం జరుగబోయే సభలో కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి రేపుతోంది. కేంద్రంలో బీజేపీ గద్దె దించడమే టార్గెట్ గా జాతీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్ మొన్నటివరకు బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం పాటించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేడయంతో కాంగ్రెస్ కు విపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి.
కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్న ఆప్, సమాజ్ వాద్ పార్టీ, టీఎంసీ, జేడీఎస్ విపక్ష పార్టీలన్నీ రాహుల్ కు అండగా నిలిచాయి. కేసీఆర్ కూడా కాంగ్రెస్ ఊహించిన దాని కన్నా ఎక్కువే రియాక్ట్ అయ్యారు. రాహుల్ పై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ మంత్రులు కూడా కేంద్రంపై తీవ్రస్థాయిలో స్పందించారు. రాహుల్ కు పూర్తి మద్దతు ప్రకటించారు.
ఇక ఇదే సమయంలో ఆదివారం బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారో అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







