రమదాన్ కొనుగోలు.. తప్పుడు ప్రచార ఆఫర్‌ల వలలో పడవద్దు
- March 26, 2023
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ సంస్థలు, ఔట్ లెట్లు అనేక ఆఫర్‌లు, ప్రమోషన్స్ ప్రకటిస్తాయి. వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తప్పుడు ప్రచార ఆఫర్‌ల వలలో పడవద్దని, వస్తువుల నాణ్యతను చెక్ చేసుకోవాలని వినియోగదారులను హెచ్చరించింది.వినియోగదారుల రక్షణకు సంబంధించిన చట్టాలకు సరఫరాదారులు కట్టుబడి ఉండేలా చూసేందుకు అల్ మవాలేహ్‌లోని పండ్లు, కూరగాయల కోసం సెంట్రల్ మార్కెట్ లో తనిఖీలు చేపట్టింది. వస్తువుల లభ్యత, రమదాన్ సమయంలో ధరల పెరుగుదలను నివారించడానికి ఈ తనిఖీలు ఉపయోగపడతాయని సిపిఏ తెలిపింది. ఏదైనా వాణిజ్య కార్యకలాపాల ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి న్యాయ నియంత్రణ అధికారులు, వాణిజ్య దుకాణాల ఇన్‌స్పెక్టర్లతో కూడిన ఫీల్డ్ విజిట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









