ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
- March 26, 2023
న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఏప్రిల్ 8న హైదరాబాద్ లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. రెండు నెలల క్రితం నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది.
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై హైదరాబాద్ బీజేపీ నేతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. పెద్దఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రధానిది అధికారిక పర్యటన అయినప్పటికీ పార్టీ తరపున జనసమీకరణ చేయనున్నారు బీజేపీ నేతలు.
ఇక, తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్ రైలు రానుంది. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్నానికి వందేభారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రబాద్-తిరుపతి మార్గంలో మరో రైలు రాబోతుంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు ప్రస్తుతం నాలుగు రైల్వే మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
అందులో ప్రస్తుతం నారాయణాద్రి రైలు నడుస్తున్న మార్గంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెడతారని తెలుస్తోంది. నారాయణాద్రి రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వరకు వెళ్తుంది. తిరుపతి వందేభారత్ రైలును మొదటగా నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రూట్ లోనే నడపనున్నట్లు తెలుస్తోంది.
సావల్యపురం ఒంగోలు రూటు పూర్తి అయ్యాక ఈ మార్గం నుంచి వందే భారత్ రైలు నడుపుతారని సమాచారం. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో రైలు ఆగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలు హైదారాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు 12 గంటల సమయం పడుతుంది. అదే వందేభారత్ రైలులో 6:30 గంటల్లోనే తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







