పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- March 28, 2023
న్యూ ఢిల్లీ: పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల ఎందరో వినియోగదారులకు మేలు జరగనుంది. మంగళవారం నాటి ఆదేశాల ప్రకారం.. జూన్ 30 లోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే జూలై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారుతుంది. ఆ తర్వాత పన్నులు చెల్లించాల్సి వస్తే అదనపు జరిమానాల్ని కూడా కేంద్రం వసూలు చేస్తుంది. దీనివల్ల వినియోగదారులపై మరింత భారం పడుతుంది.
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. పాన్ కార్డు ఉన్న ప్రతి వినియోగదారుడు, ఆ కార్డ్ నెంబర్ ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. దీనిపై కేంద్రం విధించిన గడువు గతంలోనే ముగిసింది. ఆ తర్వాత ఈ గడువును కేంద్రం పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి, మార్చి 31 వరకు ఆధార్-పాన్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. అయితే, మూడు రోజుల్లో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 51 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. పాన్-ఆధార్ లింక్ అయి ఉంటేనే బ్యాంకు ఖాతా తెరవడం, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం వంటివి చేయొచ్చు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







