రవితేజ 'రావణాసుర' ట్రైలర్ విడుదల

- March 28, 2023 , by Maagulf
రవితేజ \'రావణాసుర\' ట్రైలర్ విడుదల

హైదరాబాద్: మాస్ రాజా రవితేజ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రావణాసుర ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్ర ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై మరింత ఆసక్తి పెంచారు మేకర్స్.

సినీ లవర్స్ , అభిమానులు రవితేజ నుండి ఇంకోరుకుంటున్నారో అన్ని ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. లవ్ .. కామెడీ .. యాక్షన్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘వాడు క్రిమినల్ లాయర్ కాదు .. లా చదివిన క్రిమినల్’ అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ కు రావణాసుర హ్యాట్రిక్ హిట్ కాబోతున్నట్లు ట్రైలర్ చెప్పకనే చెపుతుంది.

క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com