అభా ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

- March 29, 2023 , by Maagulf
అభా ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

అభా : దక్షిణ యాసిర్ ప్రాంతంలోని అకాబా షార్ వద్ద సోమవారం జరిగిన ఘోర ట్రాఫిక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరుకుంది. యాసిర్‌లోని ఆరోగ్య అధికారులు మరణించిన బాధితుల అవశేషాలను గుర్తించడానికి కాలిపోయిన మృతదేహాల నుండి DNA నమూనాలను సేకరించడం ప్రారంభించారు. మృతదేహాలను మహాయిల్ యాసిర్ ఆసుపత్రి మార్చురీకి తరలించగా.. గాయపడిన యాత్రికులు యాసిర్ సెంట్రల్ ఆసుపత్రి, మహాయిల్ ఆసుపత్రి,  అభా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహాయిల్ గవర్నర్ ముహమ్మద్ అల్-కర్ఖా, మహయిల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ముబారక్ అల్-ఖహ్తానీ తో కలిసి క్షతగాత్రులను పరామర్శించి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు సాధ్యమైనంత మెరుగైన చికిత్స అందించాలని అల్-ఖర్ఖా ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం అకాబా షార్ వద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి మంటలు చెలరేగడంతో మొత్తం 21 మంది ఉమ్రా యాత్రికులు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. అభా నగరాన్ని మహాయిల్ యాసిర్ గవర్నరేట్‌తో కలిపే అకాబా షార్ వద్ద రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి వంతెనపైకి దూసుకెళ్లి బోల్తా పడి మంటలు చెలరేగాయి. బాధితులంతా ఉమ్రా చేసేందుకు మక్కా వెళుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com