వాహనదారులకు షాక్..
- March 29, 2023
న్యూ ఢిల్లీ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) వాహనదారులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 01 నుండి టోల్ చార్జీలు భారీగా పెంచబోతున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్ హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలవుతాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్ ధరలను 10 రూపాయల నుండి 60 రూపాయల వరకు పెంచారు.
ఇప్పటికే నిత్యావసర వస్తువులు , గ్యాస్ , పెట్రోల్ , కరెంట్ ఇలా ప్రతిదీ భారీగా పెరగడం తో సామాన్యలు బ్రతికే రోజులు లేవు అని మాట్లాడుకుంటున్న సమయంలో ఇప్పుడు టోల్ చార్జీల పెరగడం , ఆ భారం సామాన్య ప్రజానీకం ఫై పడనుంది. మరోపక్క మందులపై కూడా కేంద్రం భారం మోపింది. దాదాపు అన్ని మందులపై 60% వరకు పెంచింది. కరోనా సంక్షోభంలో మందులకు డిమాండ్ పెరిగిందని, ఉచిత వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయన్న సాకు చెప్పి కిందటేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం వడ్డించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!