ఖర్జూరం బొబ్బట్లు

- June 21, 2015 , by Maagulf
ఖర్జూరం బొబ్బట్లు

కావలిసిన పదార్ధాలు
మైదాపిండి - 4 కప్పులు
ఖర్జూరాలు - 25
నెయ్యి - 6 టేబుల్‌ స్పూన్లు
యాలకుల పొడి -1 టీ స్పూను
పంచదార పొడి  - 2 టేబుల్‌ స్పూన్లు
జీడిపప్పు పొడి - 2 టేబుల్‌ స్పూన్లు
పుట్నాల పొడి - 2 టేబుల్‌ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు
పల్లీల పొడి - 2 టేబుల్‌ స్పూన్లు
తయారు చేసే విధానం
ముందుగా మైదా పిండిలో తగినన్ని నీళ్లు, కాస్త నెయ్యి పోసి పూరీ పిండిలా కలిపి ఉంచాలి. ఖర్జూరాల లోపలి గింజలను తీసి ముద్దలా రుబ్బాలి. ఓ గిన్నెలో ఖర్జూరాల ముద్ద, పైన చెప్పిన పొడులన్నింటినీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేయాలి. మైదాపిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి, పూరీలా ఒత్తి దానిలో ఒక్కో ఖర్జూరం ఉండని ఉంచి, దానిని చేత్తో గానీ, అప్పడాల కర్రతో గానీ నెయ్యి రాసుకుంటూ బొబ్బట్ల మాదిరిగా వత్తాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాలిన పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. ఎక్కువ తీపి కావాలనుకునేవారు బొబ్బట్టు కాల్చిన వెంటే దాని మీద కొద్దిగా పంచదార పొడి చల్లితే టేస్ట్‌ మరింత అధికంగా ఉంటుంది. మరింకేం చేసేద్దామా వేడి వేడి ఖర్జూరం బొబ్బట్లు.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com