హాలీవుడ్ లో మంచు అక్క..!
- May 07, 2016
హాలీవుడ్ సినిమాలతోనే కెరీర్ ప్రారంభి తరువాత టాలీవుడ్ లో సెటిల్ అయిన స్టార్ వారసురాలు మంచు లక్ష్మి. మోహన్ బాబు నట వారసురాలిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మి నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా పలు రంగాల్లో సత్తా చాటుతోంది. అయితే భారత్ కు తిరిగి వచ్చాక హాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ భామ లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి హాలీవుడ్ సినిమాలో నటించింది.గతంలో లాస్ వెగాస్, ఈఆర్, డెస్పరేట్ హౌస్ వైఫ్ లాంటి టీవీ సీరియల్స్ తో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన మంచు లక్ష్మి, తాజాగా బాస్మతి బ్లూస్ చిత్రంలో నటించింది. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ తో పాటు డబ్బింగ్ ను కూడా పూర్తిచేసింది లక్ష్మి. ఆస్కార్ విజేత బ్రీ లారెన్స్, డోనాల్డ్ సతర్లాండ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం భారత్ లోనే షూటింగ్ జరుపుకోవటం విశేషం.
ఈ సినిమా ఓ సైంటిస్ట్ కథ. తాను సృష్టించిన ఓ వరి వంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకు వచ్చిన సైంటిస్ట్ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కాన్పెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బాస్మతి బ్లూస్ సినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







