భార్యకు విషం ఇచ్చి.. కూతుళ్లను గొంతు కోసి చంపాడు..!
- March 31, 2023
యూఏఈ: మార్చి 28న భార్య, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్ కేసు దర్యాప్తు ప్రాథమిక నివేదికను షార్జా పోలీసులు వెల్లడించారు. 35 ఏళ్ల భారతీయ వ్యక్తి షార్జాలోని నివాస భవనం పై నుండి దూకే ముందే తన భార్య, పిల్లలను చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ విచారణలో భార్యకు విషమిచ్చి చంపాడని తేలిందని, అయితే 3 నుండి 7 సంవత్సరాల మధ్య వయస్సు గల ఇద్దరు కుమార్తెల మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులు కనిపించాయని షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి షార్జా నివాసి అని, అయితే పొరుగున ఉన్న ఎమిరేట్‌లో పని చేస్తున్నాడని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు లేవని కూడా వెల్లడైందన్నారు. నేరానికి పాల్పడిన భర్త ఆత్మహత్య వెనుక అసలు ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు







