ఈ రెండు దేశాలకు వెళ్లవద్దు..ఒమన్ హెచ్చరిక

- March 31, 2023 , by Maagulf
ఈ రెండు దేశాలకు వెళ్లవద్దు..ఒమన్ హెచ్చరిక

మస్కట్: ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, ఈక్వటోరియల్ గినియాలోని ఆఫ్రికన్ దేశాలకు వెళ్లవద్దని ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అంటువ్యాధి మార్బర్గ్ వైరస్ వ్యాధి (MVD) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేయబడింది. వ్యాధి మరణాల రేటు 60 నుండి 80% వరకు ఉంటుందని అంచనా వేయబడిందని పేర్కొంది. యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా,  ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ హెమరేజిక్ ఫీవర్ వ్యాప్తి తీవ్రంగా ఉందన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో మినహా మార్బర్గ్ వైరస్ వ్యాధి బారిన పడిన దేశాలకు ప్రయాణాన్ని వాయిదా వేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది.

ఈ లక్షణాలు కనిపిస్తే.. వైద్యులను సంప్రదించాలి..

జ్వరం, కండరాల నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్న రోగులతో దూరంగా ఉండాలి. అలాగే, మార్బర్గ్ వైరస్ వ్యాధి ఉన్న ప్రాంతాలను సందర్శనకు దూరంగా ఉండాలి. గబ్బిలాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. అవి నివసించే గుహలు, గనులను సందర్శించవద్దు. చింపాంజీలు, గొరిల్లాలు వంటి జంతువులకు దూరంగా ఉండాలి. ప్రయాణికులు జ్వరం, చలి, కండరాల నొప్పులు, దద్దుర్లు, గొంతు నొప్పి, విరేచనాలు, బలహీనత, వాంతులు, కడుపు నొప్పి, వివరించలేని రక్తస్రావం వంటివి కనిపిస్తే.. వారిని ఇతరుల నుండి వేరుగా ఉంచాలి. వెంటనే సమీపంలోని వైద్య సంరక్షణ కేంద్రానికి (ఆసుపత్రి అత్యవసర విభాగాలు) తీసుకెళ్లాలి. ప్రయాణ సమయంలో లేదా తర్వాత (21 రోజుల వరకు) శరీరంలో గాయాలు, వారు మార్బర్గ్ వైరస్ వ్యాధి ఉన్న ప్రాంతానికి ప్రయాణించినట్లు లేదా వ్యాధి సోకిన వ్యక్తులతో లేదా దాని లక్షణాలతో సంబంధం కలిగి ఉంటే వైద్య సిబ్బందికి వెల్లడించాల మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com