ఇస్లాం ప్రవక్తలకు అవమానం.. ముగ్గురికి ఏడాది జైలుశిక్ష
- March 31, 2023
బహ్రెయిన్: ఇస్లాం మత నియమాలను ఉల్లంఘించినందుకు, ప్రవక్తలను కించపరిచినందుకు బహ్రెయిన్ నాల్గవ క్రిమినల్ కోర్టు గురువారం ముగ్గురు దోషులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. 'అల్-తాజ్దీద్ కల్చరల్ అండ్ సోషల్ సొసైటీ'లో సభ్యులుగా ఉన్న ఈ ముగ్గురిపై మోపిన ఆరోపణలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత శిక్షలను ఖరారు చేసింది. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన సూచన మేరకు ముగ్గురు నిందితులు ఇస్లాం సిద్ధాంతాలను ఉల్లంఘించినందుకు ప్రవక్తలను అవమానించినందుకు కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. నిందితులు ఇస్లామిక్ విశ్వాసంపై అనుమానం కలిగేలా.. ప్రవక్తలను అవహేళన చేస్తూ ఇంటర్నెట్‌లో బ్లాగులు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా ఇస్లామిక్ మతం ప్రాథమికాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
తాజా వార్తలు
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం
- బ్రెజిల్లో భారీ ఆపరేషన్–60 మంది గ్యాంగ్ సభ్యుల హతం
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
- APNRTS డైరెక్టర్–ఆపరేషన్స్ (సర్వీసెస్)గా నాగేంద్ర బాబు అక్కిలి నియామకం
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!







