మెడికల్ వీసా మరింత సులభతరంగా
- May 07, 2016
యూఏఈలో మెడికల్ టూరిజంని మరింత పెంచేందుకోసం మెడికల్ వీసా ప్రక్రియను సులభతరం చేయాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ భావిస్తోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రెగ్యులేషన్ అండ్ దుబాయ్ మెడికల్ టూరిజం ప్రాజెక్ట్ డాక్టర్ లేలా అల్ మర్జోకి వెల్లడించారు. 2021లో 1.3 మిలియన్ మెడికల్ టూరిస్టులు దుబాయ్ వస్తారని దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్‌ఎ) అంచనా వేస్తోంది. 2015లో దుబాయ్‌లోని 26 ప్రముఖ ఆసుపత్రుల్ని సందర్శించినవారి సంఖ్య 630,831గా ఉంది. ఇందులో యూఏఈ వాసుల సంఖ్య 332,472 కాగా, విదేశాల నుంచి వచ్చినవారు 298,359 (46 శాతం). 2015లో మెడికల్ టూరిస్టుల ద్వారా 1,0004,930,535 దిర్హామ్‌ల రెవెన్యూ రాగా, ఇది రానున్న ఐదేళ్ళలో 13 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఫెర్టిలిటీ సమస్యలు, డెర్మటాలజీ మరియు ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో వైద్య సేవల కోసం దుబాయ్‌ని ఎక్కువమంది ఎంచుకుంటున్నారని అధికారిక వర్గాలువ ఎల్లడించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







