సౌదీలో విదేశీయుల నియామకానికి కొత్త వ్యవస్థ..!
- April 05, 2023
రియాద్: మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) నైపుణ్యాల ఆధారంగా కొత్త రిక్రూట్మెంట్ సిస్టమ్ కోసం మూడు ప్రతిపాదిత నమూనాలను ప్రవేశపెట్టింది. సౌదీ వర్క్ వీసా వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ నమూనాలు భాగంగా ఉన్నాయి. రాజ్యంలో ఉత్పాదకత, ఆవిష్కరణ స్థాయిలను పెంచే లక్ష్యంతో ప్రతిపాదిత నమూనాలు అధిక, మధ్యస్థ, తక్కువ అనే ముడు వర్గాలుగా వర్గీకరించారు. మరింత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను ఆకర్షించే పథకంలో భాగంగా స్కిల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ (SVP)ని గతేడాది ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమ మొదటి దశను ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ప్రారంభించినట్లు గుర్తుచేసింది. మొదటి దశలో నైపుణ్య పరీక్ష కోసం ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, రిఫ్రిజిరేషన్/ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఎలక్ట్రీషియన్ వంటి ఐదు వృత్తులను ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







