ప్రపంచ ట్రాఫిక్ ఇండెక్స్ 2023: ఉత్తమ అరబ్ నగరంగా మస్కట్
- April 05, 2023
మస్కట్: గ్లోబల్ డేటాబేస్ "నంబియో" జారీ చేసిన 2023 సంవత్సరానికి సంబంధించిన వరల్డ్ ట్రాఫిక్ ఇండెక్స్ లో ట్రాఫిక్ పరంగా మస్కట్ అత్యుత్తమ అరబ్ నగరంగా నిలిచింది. ట్రాఫిక్ వారీగా అత్యంత రద్దీగా ఉండే నగరాల పరంగా మస్కట్ ప్రపంచంలో 185వ స్థానంలో ఉంది. ఈ విషయంలో అరబ్ ప్రపంచంలో అతి తక్కువ రద్దీగా.. ట్రాఫిక్ పరంగా అత్యుత్తమంగా నిలిచింది. దీనిపై రాయల్ ఒమన్ పోలీస్ (ROP) స్పందిస్తూ.. “సుల్తానేట్ గవర్నరేట్‌లలోని ట్రాఫిక్ డైరెక్టరేట్‌లు రహదారి వినియోగదారుల కోసం ట్రాఫిక్ ప్రవాహాన్ని సురక్షితం చేయడంలో, సలహాలు -మార్గదర్శకత్వం అందించడంలో తమ పాత్రను పోషిస్తాయి. డ్రైవర్లు, పాదచారులు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. తద్వారా వినియోగదారులకు రోడ్లు సురక్షితంగా మారతాయి.’’ అని వెల్లడించింది.
2023 సంవత్సరానికి సంబంధించిన వరల్డ్ ట్రాఫిక్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. నెదర్లాండ్స్‌లోని పెస్ట్ నగరం ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిలిచింది. క్రొయేషియాలో స్ప్లిట్, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని బాసెల్ , ఆస్ట్రియా రాజధాని వియన్నా ఈ జాబితాలో ఉత్తమ నగరాలుగా నిలిచాయి. నైజీరియా రాజధాని లాగోస్ ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన నగరంగా నిలిచింది. అమెరికా నగరం లాస్ ఏంజెల్స్ తర్వాతి స్థానంలో ఉంది. వీటి తర్వాత కోస్టారికాలోని శాన్ జోస్, శ్రీలంకలోని కొలంబో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, ఆపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని షార్జా నగరం ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







