బర్త్‌డే స్పెషల్.! నేషనల్ క్రష్ రష్మిక న్యూ లుక్ అదిరిపోయిందిగా.!
- April 05, 2023
నేషనల్ క్రష్ రష్మిక మండన్న పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి ఆయా చిత్ర యూనిట్స్ స్పెషల్ బర్త్‌డే విషెస్ చెబుతోంది.
అందులో భాగంగా రష్మిక మొదటి సినిమా ‘ఛలో’ డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రష్మిక లుక్ రిలీజ్ చేసి టీమ్ బర్త్‌డే విషెస్ తెలిపింది.
ఈ సినిమాలో రష్మిక ఎన్నారై అమ్మాయిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన స్టైలిష్ లుక్‌ని తాజాగా రిలీజ్ చేశారు. అలాగే రష్మిక నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ నుంచి కూడా లుక్ రిలీజ్ చేశారు.
ఈ లుక్స్‌లో రష్మిక లంగా వోణీలో వింటేజ్ లుక్స్‌తో క్యూట్‌గా బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. రష్మికను ఇలా చూస్తున్న ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నెట్టింటి వేదికగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇలాంటి బర్త్‌డేలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







