అసలు పుష్ప ఎక్కడ.? గ్లింప్స్‌తో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ.!
- April 05, 2023
‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప’ అనే డైలాగులతో ‘పుష్ప 2’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘అసలు పుష్ప ఎక్కడ.?’ అంటూ ఈ గ్లింప్స్ ద్వారా ఫ్యాన్స్‌లో ఆసక్తి క్రియేట్ చేశారు. ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. దీనికే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఈ గ్లింప్స్‌కి సంబంధించి పూర్తి వీడియో ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు ఇంకా పెద్ద పండగే బన్నీ ఫ్యాన్స్‌కి. చెప్పిన మాట ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ అప్డేట్ అయితే వచ్చేసింది.
‘పుష్ప’ మొదటి పార్ట్‌తోనే ప్యాన్ ఇండియాని ఆకర్షించిన బన్నీ, ఇప్పుడు సెకండ్ పార్ట్‌తో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాడా.? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఖఛ్చితంగా అంతకు మించి అనే రేంజ్‌లోనే ‘పుష్ప 2’ వుండబోతోందనీ అర్ధం చేసుకోవచ్చు. రష్మిక మండన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ లీడ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. అనసూయ, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







