ఏప్రిల్ 7న బిగ్ బ్యాడ్ వోల్ఫ్ సేల్

- April 05, 2023 , by Maagulf
ఏప్రిల్ 7న బిగ్ బ్యాడ్ వోల్ఫ్ సేల్

దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక సేల్ బిగ్ బ్యాడ్ వోల్ఫ్ (BBW) ఐదవ ఎడిషన్‌ ఏప్రిల్ 7 నుండి 16 వరకు జరుగనుంది. ఈ సేల్‌లో 1 మిలియన్‌కు పైగా పుస్తకాలపై 75 శాతం వరకు తగ్గింపులు లభిస్తాయి. కొన్ని పుస్తకాల ధరలు  Dh2 నుండి ప్రారంభమవుతాయి. ఈ సేల్ దుబాయ్ స్టూడియో సిటీలో ఉదయం 9 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నిర్వహించబడుతుంది. ప్రవేశం ఉచితం అని  BBW సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ యాప్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే తమ దగ్గర 60-70 శాతం కొత్త పుస్తకాలు ఉన్నాయని, అలాగే ఈసారి అధికంగా తగ్గింపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com