కోవిడ్, న్యుమోనియాలను అధిగమించిన 70 ఏళ్ల వృద్ధుడు

- April 06, 2023 , by Maagulf
కోవిడ్, న్యుమోనియాలను అధిగమించిన 70 ఏళ్ల వృద్ధుడు

యూఏఈ: దుబాయ్‌లో 70 ఏళ్ల ప్రవాసుడు అనిస్ అబ్బాస్‌భాయ్ కొచ్చిన్‌వాలా.. కోవిడ్, న్యుమోనియాలతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలను అధిగమించి ఔరా అనిపించారు. అతను 27 రోజుల పాటు లైఫ్ సపోర్టుతో గడిపినా.. చివరకు అన్ని సమస్యలను అధిగమించారు.  దీర్ఘకాలిక గుండె జబ్బులు, కోవిడ్-19, ఇంట్రా-సెరెబ్రల్ బ్లీడింగ్, న్యుమోనియా, తీవ్రమైన పునరావృత మూర్ఛలు, హెర్పెస్‌వైరల్ ఎన్సెఫాలిటిస్, మెదడును దెబ్బతీసే వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో సహా పలు ప్రాణాంతక సమస్యలతో ఇక మరణం తథ్యమని వైద్యులు తేల్చేసిన పరిస్థితులతో.. అతను ధైర్యంగా వీటన్నింటిని జయించి.. తిరిగి కుటుంబంతో హ్యాపీగా ఉండనున్నారు.  సుమారు మూడు నెలల పాటు చికిత్స పొందిన తరువాత, అతను పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. “తేలికపాటి జ్వరం వచ్చింది. ఇంట్లోనే కిట్ ద్వారా కోవిడ్-19 టెస్ట్ చేసుకోగా.. పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంట్లో క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాము. కానీ 10 రోజులలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు నన్ను మంఖూల్‌లోని ఆస్టర్ హాస్పిటల్‌కు తరలించారు. ” అని అనిస్ అబ్బాస్‌భాయ్ వివరించారు.

ఆసుపత్రి అత్యవసర విభాగంలో వైద్యులు అబ్బాస్‌భాయ్ కు MRI స్కాన్ చేశారు. అందులో అతని మెదడులో తీవ్రమైన ఇన్ఫార్క్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. మంఖూల్‌లోని ఆస్టర్ హాస్పిటల్‌లో ఐసియు బెడ్‌ల కొరత కారణంగా, అతడిని షార్జాలోని ఆస్టర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ మహ్మద్ నియాజ్ పర్యవేక్షణలో అబ్బాస్‌భాయ్‌కి చికిత్స అందించారు. ఆసుపత్రిలో 40 రోజులపాటు ఉన్న అబ్బాస్‌భాయ్‌.. పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. అబ్బాస్‌భాయ్ కేసు చాలా సవాలుతో కూడుకున్నదని డాక్టర్ నియాజ్ అన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com