AFC ఆసియా కప్ ఖతార్ 2023: తేదీలు, వేదికలు ఖరారు
- April 06, 2023
కౌలాలంపూర్: 2024 జనవరి 12 నుండి ఫిబ్రవరి 10 వరకు AFC ఆసియా కప్ ఖతార్ 2023 18వ ఎడిషన్ పోటీలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) ప్రకటించింది. ఆసియాలోని టాప్ 24 దేశాలు ఆసియా ఫుట్‌బాల్ ట్రోపీ కోసం పోటీలో ఉన్నాయి. ఈ పోటీలు ఎనిమిది స్టేడియాలలో జరుగనున్నాయి. వీటిలో ఆరు FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 ను నిర్వహించిన వేదికలు కూడా ఉన్నాయి. అల్ జనోబ్ స్టేడియం, అల్ బైట్ స్టేడియం, అహ్మద్ బిన్ అలీ స్టేడియం, అల్ తుమామా స్టేడియం, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం.. అలాగే జస్సిమ్ బిన్ హమద్ స్టేడియం, అబ్దుల్లా బిన్ ఖలీఫా స్టేడియాలలో పోటీలు నిర్వహించనున్నట్లు AFC అధ్యక్షుడు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా తెలిపారు. స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ, ఖతార్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆసియా ఫుట్‌బాల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొన్నారు. AFC ఆసియా కప్ ఖతార్ 2023 30 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఇది ఆసియాలోని ఫుట్ బాల్ అభిమానులను అలరించనుంది. ఇదిలా ఉండగా.. AFC ఆసియా కప్ ఖతార్ 2023కి సంబంధించిన అధికారిక డ్రా వేడుకను 2023 మే 11న మధ్యాహ్నం 2 గంటలకు దోహాలోని ప్రపంచ ప్రఖ్యాత కటారా ఒపెరా హౌస్‌లో నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!







