ఒమన్‌లో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు..!
- April 06, 2023
మస్కట్: ఈ వారాంతంలో అల్ వుస్తా, ధోఫర్ గవర్నరేట్‌లతోపాటు ఒమన్ సుల్తానేట్‌లోని ఇతర ప్రాంతాలలో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఒమన్ వాతావరణ విభాగం ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వచ్చే ఆదివారం వరకు వర్షపాతం కొనసాగుతుందని కూడా అంచనా వేసింది. “రాబోయే రోజులలో శుక్ర, శని, ఆదివారాల్లో హజార్ పర్వతాలు, అల్ వుస్తా, ధోఫర్ గవర్నరేట్‌లలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ” అని ఒమన్ వాతావరణ విభాగం హెచ్చరిక జారీ చేసింది. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాగులు, వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. అత్యవసర సమయాల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో







