కాపాడిన నిజాయితీ
- June 21, 2015
ఉజ్జయినీ రాజ్యాన్ని విక్రమసేనుడు పాలించేవాడు. అతడు పరిపాలనాదక్షుడిగానే కాకుండా నిస్వార్ధపరుడైన రాజుగానూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకసారి పదవికి యోగ్యుడిని ఎంపిక చేసే బాధ్యతను మహా మంత్రికి అప్పగించాడు రాజు. మహామంత్రి దండోరా వేయించడంతో చాలా మంది అభ్యర్ధులు వచ్చినా, అన్ని అర్హతలూ ఉన్న ఆనందుడు, సునందుడు అనే ఇద్దరు యువకులు మాత్రం అన్ని పరీక్షల్లోనూ నెగ్గి చివరి వరకూ నిలిచారు. చివరికి వారిలో యోగ్యుడిని కోశాధికారిగా ఎంపిక చేయాల్సి వచ్చింది.
మహామంత్రి ఆనందుడిని రహస్యంగా పిలిచి ‘చూడు మిత్రమా.. మీ ఇద్దరిలో నేను ఎవరిని ఎంపిక చూస్తే వాళ్లే కోశాధికారి అవుతారు. నాకు వెయ్యి వరహాలు ఇస్తే కొలువు నిన్నే వరిస్తుంది.’ అంటూ ఊరించాడు. ఆనందుడు వెంటనే నాకు కాస్త గడువు ఇస్తే ఆ మొత్తాన్ని తెచ్చి ఇస్తాను. అంతే కాదు మీరు అవసరానికి కొశాగారం నుంచి డబ్బు తీసుకున్నా వాటిని లోక్కల్లో చూపించను. కొలువు మాత్రం నాకే ఇప్పించాలి సుమా అన్నాడు సంతోషంగా. ఆ తర్వాత మంత్రి సునందుడినీ అదే విధంగా పిలిచి లంచం అడగ్గా.. అందుకు సునందుడు నా అర్హతకు తగ్గ ఉద్యోగం వచ్చే వరకూ ఎదురు చూస్తాను. అంతేగానీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వను. అంతే కాదు మీలాంటి వారి వల్ల రాజ్యానికే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడే మీ చేష్టల గురించి రాజుగారికి తెలియజేస్తాను అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్లబోయాడు సునందుడు. దాంతో మహామంత్రి అతన్ని ఆపి సముదాయిస్తూ.. ఆగు సునందా! నీలాంటి నిజాయితీపరుడి కోసమే నేను ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నది అంటూ.. వెంటనే అతన్ని కోశాధికారిగా నియమించాడు.
నిజాయితీకి మించిన ధనం లేదు అనేది ఈ కథలోని నీతి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







