సౌదీ లో 100 మందికి ఫైగా ఉరి తీసారు
- June 21, 2015
కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న వికిలీక్స్ మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. తాజాగా వికిలీక్స్ విడుదల చేసిన 61వేల కేబుల్స్ పెను సంచలనం సృష్టిస్తున్నాయి. వీటికి సౌదీ కేబుల్స్ అని పేరు పెట్టారు. ఇవి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించినవి సంబంధించిన కేబుల్స్ కావడంతో ఆ దేశంతో సంబంధాలు గల అన్ని దేశాలూ ఈ వికి లీక్స్ వల్ల తమ కొంప ఎక్కడ మునుగుతుందో అని కలవరపడుతున్నాయి. సౌదీ రహస్య నియంతృత్వాన్ని అమలు చేస్తున్నదని వికిలీక్స్ సారథి జులియన్ అసాంజే ప్రకటించడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. సౌదీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న 100 మందిని శిరచ్ఛేదం చేసి ఆ సంఘటనను పెద్ద పండుగగా నిర్వహించిందని కూడా వికిలీక్స్ ప్రకటించింది. సౌదీ అరేబియా పాలన అస్తవ్యస్తంగా ఉందని కూడా అసాంజే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ కేబుల్స్ ఆస్ట్రేలియానుంచి పనిచేస్తున్న ఇస్లామిక్ గ్రూపులకు సంబంధించినవని తెలుస్తున్నది. అలాగే అరబిక్ ప్రసార సాధనాలకు సౌదీ అరేబియా భారీఎత్తున డాలర్లను ఎరవేస్తున్న విషయం కూడా ఈ లీక్స్‌లో బయటపడింది. ఆస్ట్రే లియాలో చదువుకుంటున్న సౌదీ విద్యార్థుల కార్య కలాపాలను కూడా సౌదీ రహ స్యంగా పర్యవేక్షిస్తున్నట్టు వికిలీక్స్ బయటపెట్టాయి. తమకు అనుకూలంగా పనిచేస్తున్న అరబిక్ ప్రచార సాధనాలకు 10,000 డాలర్లనుంచి 40 వేల డాలర్ల వరకూ చెల్లించవలసిందిగా కేన్బెరాలోని సౌదీ రాయబార కార్యా లయానికి సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ రహస్య ఆదేశాలు పంపించిందట. ఈ విషయాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సౌదీ కేబుల్స్‌లో ఉన్నాయట! ప్రస్తుతం విడుదల చేసిన ఈ 61వేల కేబుల్స్ కేవలం శాంపిల్ మాత్రమేనని వికిలీక్స్ ప్రకటించడంతో రాబోయే వాటిలో ఏముంటాయోనని అనేక దేశాలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే క్రమంగా మరో 50 లక్షల రహస్య పత్రాలు విడుదల చేస్తామని కూడా వికిలీక్స్ నిర్వాహకులు వెల్ల డించారు. సౌదీ అరేబియా ఘాతు కాలు అన్నీ ఇన్నీ కావని వికిలీక్స్ సారథి జులియన్ అసాంజే ప్రకటించారు. సౌదీ అరేబియా ఇప్పటికే అనేక రూపాలలో ప్రపంచ వ్యాప్తంగా తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నదని వికిలీక్స్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







