రమదాన్ ముగిసే వరకు భారీ వర్షం, ఇసుక తుఫాను, హిమపాతం..!

- April 08, 2023 , by Maagulf
రమదాన్ ముగిసే వరకు భారీ వర్షం, ఇసుక తుఫాను, హిమపాతం..!

 జెడ్డా: జాతీయ వాతావరణ కేంద్రం (NCM) సూచన ప్రకారం.. ఆదివారం నుండి పవిత్ర రమదాన్ మాసం ముగిసే వరకు సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు, ఇసుక తుఫాను, మంచు కురుస్తుంది. ఖాసిం, రియాద్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో సోమవారం నుండి గురువారం వరకు ధూళి తుఫానులు, వడగండ్లు, హిమపాతంతో కూడిన   తుఫానులు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఆది, సోమవారాలతో పాటు బుధ, గురువారాల్లో అసిర్, అల్-బహా, జజాన్, మక్కా, నజ్రాన్, మదీనా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఎన్‌సిఎం ఒక ప్రకటనలో తెలిపింది.

సోమవారం నుండి బుధవారం వరకు తబుక్, అల్-జౌఫ్, నార్తర్న్ బోర్డర్స్ రీజియన్‌లలో మోస్తరు నుండి భారీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. తూర్పు ప్రావిన్స్‌లో సోమవారం నుండి గురువారం వరకు  మక్కా, తబుక్, మదీనా ప్రాంతాలలో.. ఆదివారం,  సోమవారాల్లో అలాగే బుధవారం కూడా తేలికపాటి నుండి మోస్తరు ఉరుములు, ఇసుక తుఫానులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే వారం మధ్య వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. సౌదీలోని వివిధ ప్రాంతాలలో వాతావరణ పరిస్థితిలు, దాని వల్ల ప్రభావితమైన ప్రాంతాల గురించి మరింత సమాచారం పొందడానికి తమ వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని NCM ప్రజలను కోరింది. సమర్థ అధికారులు జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com