ఏప్రిల్‌లో మరో నానోశాటిలైట్ ప్రయోగం: దుబాయ్
- April 09, 2023
దుబాయ్: దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (DEWA) తన రెండవ నానోశాటిలైట్ను ఈ ఏప్రిల్‌లో ప్రయోగించడానికి సన్నాహాలు పూర్తి చేసినట్లు శనివారం ప్రకటించింది. దీనిని రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ కోసం రూపొందించినట్లు.. 6U నానోశాటిలైట్ స్పేస్-డి ప్రోగ్రామ్‌లో ఇది భాగమని తెలిపింది. DEWA శాట్-2 USలోని కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి SpaceX ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ నానోశాటిలైట్ ను లిథువేనియాలోని నానోఏవియానిక్స్ సహకారంతో అథారిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో రూపొందించి అభివృద్ధి చేశారు. కొత్త ఉపగ్రహం అధిక-రిజల్యూషన్ కెమెరాను (4.7 మీటర్లు) కలిగి ఉందని, ఇది భూమి పరిశీలన మిషన్ల కోసం ఉపయోగపడుతుందని అథారిటీ వెల్లడించింది. హై-రిజల్యూషన్ కెమెరా సుమారు 500కిమీ కక్ష్య నుండి 7 స్పెక్ట్రల్ బ్యాండ్లలో నిరంతర లైన్-స్కాన్ ఇమేజింగ్‌ను అందిస్తుందని, కొత్త ఉపగ్రహంలో గ్రీన్హౌస్ వాయువులను కొలవడానికి ఇన్ఫ్రారెడ్ సాధనాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఈ నానోశాటిలైట్ సముద్రపు నీటి ఉష్ణోగ్రత, సముద్రపు నీటి లవణీయత, ఎరుపు పోటును గుర్తించడం, అలాగే పొగమంచు పర్యవేక్షణ గురించిన ఖచ్చితమైన అంచనాలను అందిస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







