సాంప్రదాయ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు..!
- April 09, 2023
రియాద్: సౌదీ అరేబియాలో ఆటోమొబైల్ సప్లై కంపెనీలు, కార్ రెంటల్ కంపెనీల మధ్య మూడు ఒప్పందాలపై సంతకాల కార్యక్రమాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (PTA) నిర్వహించింది. ఒప్పందంపై సంతకం చేసిన ఏడాదిలోగా అల్-మోఫ్తాకు 100 ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసేందుకు నాఘి మోటార్స్ కంపెనీ, అల్-మోఫ్తా కార్ రెంటల్ కంపెనీ మొదటి ఒప్పందంపై సంతకాలు చేశాయి. బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేయడానికి అల్మాజ్డౌయ్ మోటార్స్ కంపెనీ, బడ్జెట్ రెంట్ ఎ కార్ కంపెనీ మధ్య రెండవ ఒప్పందం కుదిరింది. మూడవ ఒప్పందాన్ని యెలో రెంట్ ఎ కార్ కంపెనీతో అల్మాజ్డౌయ్ కంపెనీ కుదుర్చుకుంది. సాంప్రదాయ కార్లను ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లతో భర్తీ చేయడం అద్దెకార్ల రంగం అభివృద్ధికి, ఆధునిక పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాలపై ఆధారపడటానికి తోడ్పడుతుందని, ఇది సేవల నాణ్యత, సామర్థ్యంలో క్వాంటం లీపుకు దోహదం చేస్తుందని PTA పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించడం, నాణ్యత స్థాయిని పెంపొందించడం, క్లీన్ ఎనర్జీపై ఆధారపడే ఆధునిక మార్గాలను.. నాణ్యమైన రవాణా పద్ధతులను అవలంబించడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ చేసిన ప్రయత్నాలకు అనుగుణంగా ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పీటీఏ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







