టిక్‌టాక్ లో అసభ్య వీడియో.. ఐదుగురు ఫిలిప్పీన్స్ అరెస్ట్..!
- April 09, 2023
యూఏఈ: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో అసభ్యకరమైన వీడియోను పోస్ట్ చేసినందుకు ఐదుగురు ఫిలిప్పీన్స్ ప్రవాసులను షార్జా పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్‌లోని ఫిలిప్పీన్ కాన్సుల్ జనరల్ రెనాటో డ్యూనాస్ జూనియర్ ఈ ఘటనపై స్పందించారు. ఫిలిపినోలు "కేవలం వినోదం కోసం" ఆ వీడియోను అప్‌లోడ్ చేసారని తెలిపారు. అది వారిని చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెడుతుందని వారు ఊహించి ఉండరని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఫిలిప్పీన్స్ ను పోలీసులు వేశ్యలుగా పొరబడ్డారని చెప్పారు. కేసు షార్జా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా విచారణలో ఉందన్నారు. యూఏఈలోని ఫిలిపినోలు స్థానిక ప్రభుత్వ ఆచారాలను గౌరవించాలని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌ను పునర్ సమీక్షించుకోవాలని అతను సూచించారు. యూఏఈలో ఆచారాలు, నైతికతకు వ్యతిరేకంగా చర్యలు తీవ్రంగా ఉంటాయని, వారి సంస్కృతి భిన్నంగా ఉంటుందని, కాబట్టి ఫిలిప్పీన్స్ చాలా చాలా గౌరవంగా ఉండాలి.” అని ఫిలిప్పీన్స్ ప్రభుత్వ వలస కార్మికుల విభాగం (DMW) కార్యదర్శి సుసాన్ సూచించారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







