వేలంలో కొత్త రికార్డు సృష్టించిన కారు నంబర్ ప్లేట్ P7
- April 09, 2023
దుబాయ్: దుబాయ్‌లో శనివారం రాత్రి జరిగిన ‘మోస్ట్ నోబుల్ నంబర్స్’ వేలంలో వాహన నంబర్ ప్లేట్ P7.. 55 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. జుమేరాలోని ఫోర్ సీజన్స్ రిసార్ట్‌లో అతిధుల మధ్య నిర్వహించిన వేలం హోరాహోరీగా సాగింది. పదహారేళ్ల క్రితం.. అబుధాబిలో ఒక నంబర్ ప్లేట్ 52.5 మిలియన్ దిర్హాలకు అమ్మబడినప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించింది. 15 మిలియన్ దిర్హామ్‌తో ప్రారంభమైన బిడ్ నిమిషాల వ్యవధిలో 55 మిలియన్ దిర్హామ్‌లకు చేరుకొని రికార్డు సృష్టించింది. వైస్ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించిన “1 బిలియన్ మీల్స్ ఎండోమెంట్” ప్రచారానికి మద్దతుగా, ప్రత్యేక వాహన ప్లేట్, ఫోన్ నంబర్‌ల కోసం “మోస్ట్ నోబుల్ నంబర్స్” ఛారిటీ వేలం నిర్వహించిన విషయం తెలిసిందే.
UAE అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లు
P7 (దుబాయ్ - Dh55 మిలియన్ ( 2008లో అబుధాబి వేలంలో - Dh52.2 మిలియన్)
AA9 (దుబాయ్, 2021లో వేలం) - Dh38 మిలియన్
AA8 (దుబాయ్, 2022లో వేలం)- Dh35 మిలియన్
D5 (దుబాయ్, 2016లో వేలం) - Dh33 మిలియన్
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







