ఆ యూరోపియన్ మహిళ కూతురికి తండ్రి ఎమిరాటే: యూఏఈ కోర్టు
- April 09, 2023
యూఏఈ: 8 ఏళ్ల బాలికకు తండ్రి ఎమిరాటీ వ్యక్తేనని యూఏఈ కోర్టు నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఒక యూరోపియన్ మహిళ తన ఎనిమిదేళ్ల కుమార్తెకు తండ్రి ఎమిరాటీ అని నిర్ధారించాలని కోర్టును ఆశ్రయించింది. ఎమిరాటీ వ్యక్తి (ప్రతివాది)ని వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు తాను(ఎమిరాటీ) విడిచి వెళ్లాడని కోర్టుకు తెలిపింది. వివాహ ఒప్పందం, పిల్లల జనన ధృవీకరణ పత్రం, యూరోపియన్ దేశానికి చెందిన ఆమె ఐడి, యూఏఈలో ఆమె నివాసం, ఇతర పత్రాల రూపంలో దీనికి సంబంధించిన ఆధారాలను మహిళ కోర్టుకు సమర్పించింది. ఆ సమయంలో తండ్రి ఎక్కడున్నాడో తెలియకపోవడంతో బాలికను తాను పుట్టిన యూరప్ దేశంలోనే రిజిస్ట్రేషన్ చేయించినట్లు తల్లి తెలిపింది. తన కుమార్తెను నమోదు చేసేటప్పుడు, ఆమె ఎమిరాటి వ్యక్తిని తన తండ్రిగా పేర్కొంది. కాగా, ప్రతివాది ఆ బిడ్డ తన కూతురేనని అంగీకరించాడు. విడిచివెళ్లిన సమయంలో ఆమె తల్లి గర్భవతి అని తనకు తెలియదని, అందుకు తాను ఆ బాలికను కూతురిగా అంగీకరించలేదని కోర్టుకు తెలిపాడు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్









