సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఛైర్మన్ గా యార్లగడ్డ సుధాకర్
- April 09, 2023
మహారాష్ట్ర: షిరిడీ సాయిబాబాకు ప్రత్యక్షంగా సేవలు అందించాలని తహతహలాడే భక్తులు కోట్ల సంఖ్యలో ఉంటారు.అయితే, ఆ అదృష్టం అందరికీ దక్కదు. కానీ, గత సంవత్సరం నుండి ఈ అరుదైన అవకాశం, అదృష్టం తెలుగు వ్యక్తి అయిన యార్లగడ్డ సుధాకర్ కు దక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా మోపిదేవి మండలం రావివారి పాలెంకు చెందిన యార్లగడ్డ సుధాకర్ వృత్తిరిత్యా న్యాయమూర్తి. ప్రస్తుతం ఆయన అహ్మద్‌నగర్‌లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఒక తెలుగు వ్యక్తికి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి లభించడం పట్ల పలువురు తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ధర్మకర్తల నియామకం లోపభూయిష్టంగా ఉందని బాంబే హైకోర్టు, ఔరంగాబాద్ బెంచ్ ఆక్షేపించి ఆ నియామకాలను రద్దు చేసింది.ధర్మకర్తల స్థానంలో కోర్టు అహ్మద్‌నగర్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి(యార్లగడ్డ సుధాకర్), అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన తాత్కాలిక కమిటీని నియమించింది. ఆ కమిటీలో ఆలయ CEO కూడా ఉన్నారు. 2022 సెప్టెంబర్ 13న కమిటీ ఛైర్మన్‌గా యార్లగడ్డ సుధాకర్ అదనపు బాధ్యతలు స్వీకరించారు.
యార్లగడ్డ సుధాకర్ తండ్రి గారు 1982లో యార్లగడ్డ వెంకటేశ్వరరావు రైతుగా నాగ్‌పూర్‌కు వలస వచ్చారు.కానీ, ఆయన మాత్రం 10వ తరగతి వరకు మోపిదేవి ZPHSలో, ఇంటర్మీడియట్ వరకు అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి, ఆ తర్వాత నాగ్‌పూర్‌కి వచ్చారు. నాగ్‌పూర్‌లో ఎల్ఎల్బి, ఎంకామ్ పూర్తి చేశారు.నాగ్‌పూర్, రామ్‌టెక్‌లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ కొనసాగించారు.1995లో మహారాష్ట్ర న్యాయశాఖలో చేరారు.ఈ క్రమంలో2021 జులై 01న అహ్మద్‌నగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.

న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న తనకు షిరిడీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ బాధ్యతలు లభించడం ఆనందంగా ఉందని యార్లగడ్డ సుధాకర్ అన్నారు.తనకు లభించిన ఈ అవకాశాన్ని భక్తులకు మరింత మెరుగైన సేవల కోసం వినియోగిస్తానన్నారు.భక్తులకు మంచి పనులు చేయడానికి సాయిబాబా నుండి ఛైర్మన్‌గా నియామకం జరిగిందని నమ్ముతున్నట్లు తెలిపారు.తాను 2021 నుండి ఆలయ ఛైర్మన్‌గా వ్యవహారాలను చూస్తున్నప్పటికీ, న్యాయమూర్తిని కాబట్టి తక్కువ ప్రొఫైల్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.మతం, కులం, భాష మొదలైన వాటి ఆధారంగా ప్రజలపై వివక్ష చూపవద్దని సాయిబాబా ప్రబోధాలను పాటిస్తున్న సాయిబాబా భక్తులందరికీ ఈ సందర్భంగా యార్లగడ్డ సుధాకర్ సూచించారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









