తెలంగాణలో పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ..
- April 09, 2023
న్యూ ఢిల్లీ: తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిని చేర్చారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం సరికాదని రాష్ట్ర సర్కారు అంటోంది. మొత్తం 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. దీనిపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ ఇంతకుముందే చర్చించారు.
గవర్నర్ తీరు మంత్రి మండలి సలహాకు వ్యతిరేకంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి విచక్షణాధికారాలు గవర్నర్ కు ఉండవని అంటోంది. రాష్ట్రానికి సంబంధించిన ఆయా బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టడానికి న్యాయమైన కారణాలు ఏవీ లేవని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు నెలలు గడుస్తున్నా బిల్లులకు ఆమోదం లభించలేదని, దీంతో వేరే మార్గం లేకే ప్రత్యేక పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









