పంజాబ్ కింగ్స్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు...
- April 09, 2023
హైదరాబాద్: ఐపీఎల్ 2023లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు ఖాతా తెరిచింది. ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది.హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్ హెచ్ గెలుపొందింది. ఈ సీజన్ లో రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది.
144 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 17.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో రాహుల్ త్రిపాఠీ హాఫ్ సెంచరీతో జట్టుని గెలిపించాడు. త్రిపాఠి 48 బంతుల్లో 74 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో మార్ క్రమ్ 21 బంతుల్లో 37 పరుగులతో(నాటౌట్) రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఒంటరి పోరాటం చేశాడు. జట్టు సభ్యులు తనకు సహకరించకున్నా పట్టుదలతో తొలి ఓవర్ నుంచి ఆఖరి ఓవర్ వరకు బ్యాటింగ్ కొనసాగించాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
శిఖర్ ధావన్ ఒక్కడే 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తృటిలో శతకాన్ని కోల్పోయాడు. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కర్రాన్(22) మినహా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు.
హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే 4 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కు ఓ వికెట్ లభించింది.
ఈ సీజన్ లో హైదరాబాద్ ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడింది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమి చవి చూసింది. తొలి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్, రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడింది. ఇక, పంజాబ్ విషయానికి వస్తే.. పంజాబ్ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సీజన్ లో వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్ కి హైదరాబాద్ షాక్ ఇచ్చింది. పంజాబ్ తొలి ఓటమి రుచి చూసింది. తన తొలి మ్యాచ్ లో కోల్ కతాపై, రెండో మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ పై పంజాబ్ విజయం సాధించింది. మూడో మ్యాచ్ లో హైదరాబాద్ చేతిలో చిత్తైంది.
స్కోర్లు..
పంజాబ్ కింగ్స్ : 20 ఓవర్లలో 143/9
సన్ రైజర్స్ హైదరాబాద్ : 17.1 ఓవర్లలో 145/2
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









