మంజు రమణన్ 'ఉమెన్ ఇన్ సినిమా ఫ్రమ్ యూఏఈ' ఈవెంట్ విజయవంతం...
- April 10, 2023
దుబాయ్: దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ లో మీడియా ప్రముఖురాలు మంజు రమణన్ 'ఉమెన్ ఇన్ సినిమా ఫ్రమ్ యూఏఈ' పేరుతో ఒక ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని కాన్సుల్ (కాన్సులర్, లేబర్ & MADAD) బిజేందర్ సింగ్, దుబాయ్ ఆధారిత వ్యాపారవేత్త రాజన్ లాల్ ప్రారంభించారు.సామాజిక కార్యకర్త, సినీ నిర్మాత స్మితా ఠాక్రే ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు."యూఏఈలోని మహిళా సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చిత్రరంగంలో ఉన్న మహిళలందరు ఒకే వేదిక పైకి రావడం చాలా సంతోషంగా ఉంది."ఆమె అన్నారు.ఈ సందర్భంగా హాజరైన ప్యానలిస్టులు మహిళలు పని ప్రదేశాలలో ఎదుర్కొనే సమస్యలు, లింగ సమానత్వం, సహాయక సహోద్యోగులు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, యజమానుల వరకు ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు వాటి పరిష్కారం గురించి చర్చించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ప్యానలిస్టులలో పాన్ ఇండియన్ యాక్టర్/డ్యాన్సర్ కల్పనా అయ్యర్, లైన్ ప్రొడ్యూసర్ మినీ శర్మ, బాలీవుడ్ స్క్రీన్ రైటర్ అల్థియా కౌశల్, ఫిల్మ్ మేకర్ హసీబా ఫ్రీహా, దుబాయ్ మెటా ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ లీలా మసినీ, ఫౌండర్- MD సినిమా అకిల్ బుథీనా హమెద్ కాజిమ్ ఉన్నారు.ఈ ఈవెంట్‌కు KKDD ఫిల్మ్స్, ఖలీజ్ టైమ్స్, ప్లేఫీల్డ్ ఎంటర్టైన్మెంట్, ఇన్నారా, అల్ ఐన్ వాటర్, కొచ్చిన్ హార్బర్, అరూషి బ్యూటీ సెలూన్- స్పా, బాబీ సహోత్రా స్పాన్సర్ గా వ్యవహారించాయి.అలాగే సుస్థిర ఉత్పత్తులలో నైపుణ్యం కలిగిన దుబాయ్ ఆధారిత వ్యాపారవేత్త గుడ్డి బజాజ్ ఈవెంట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ కార్యక్రమం.. ఇఫ్తార్ సమయానికి ముందు ముగిసింది.




తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







