భారీగా పెరుగుతున్న కొవిడ్ -19 కేసులు..

- April 10, 2023 , by Maagulf
భారీగా పెరుగుతున్న కొవిడ్ -19 కేసులు..

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది.రోజురోజుకు పాజిటివ్ కేసుల  సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. పలు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ  సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల ( సంఖ్య 35,199కి చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఫిబ్రవరిలో 21 శాతంగా ఉన్న XBB.1.16 వేరియంట్ కేసులు, మార్చి నెలలో 32శాతానికి పెరిగాయి. తాజాగా నమోదైన కొత్త కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,47,56,616 కు చేరింది. మరణాల సంఖ్య 5,30,979కి చేరింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.39శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,726మంది. గత 24గంటల్లో మొత్తం 205 డోస్‌ల వ్యాక్సిన్‌ను అందించారు. దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 220,66,23,527 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను అందించారు.

దేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యుపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. యూపీలో ఆదివారం ఒక్కరోజే 319 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,192గా ఉంది. మరోవైపు ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 699 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో బాధపడుతున్న నలుగురు మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com