చిన్న పిల్లల్లో డయాబెటిస్ గుర్తించడం ఎలా.?

- April 10, 2023 , by Maagulf
చిన్న పిల్లల్లో డయాబెటిస్ గుర్తించడం ఎలా.?

డయాబెటిస్‌కి వయసుతో సంబంధం లేదు. కొన్ని జన్యుపరమైన రీజన్స్, ఒక పర్టిక్యులర్ ఏజ్‌లో మాత్రమే డయాబెటిస్ ఎటాక్ చేసేది ఒకప్పుడు. కానీ, ఇప్పుడు బొత్తిగా కనికరం లేకుండా పోయింది. కడుపులోని బిడ్డను సైతం వదిలిపెట్టడం లేదు ఈ మహమ్మారి.
మరి చిన్న పిల్లల్లో డయాబెటిస్‌ని గుర్తించడం ఎలా.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో షుగర్ వ్యాధిని నియంత్రణలో పెట్టొచ్చు.?
పిల్లలు పదే పదే యూరిన్‌కి వెళ్లడం, అధిక దాహంతో వున్నట్లు కనిపించడం, ఊరికే అలసిపోవడం, వెయిట్ లాస్ తదితర లక్షణాలు వారిని డయాబెటిక్స్‌గా గుర్తించేందుకు ఆస్కారం కలిగిస్తాయ్. ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
ఇక, జాగ్రత్తల విషయానికి వస్తే, ఫుడ్‌లో కంపల్సరీ బీన్స్, క్యారెట్, చీజ్‌తో పాటూ అన్ని రకాల తాజా కూరగాయల్నీ ఆహారంలో భాగం చేయాలి. ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. ఫైబర్ రిచ్ ఆహారాన్ని ఎక్కువగా అందించాలి. 
అధిక మొత్తంలో షుగర్ మిక్స్ చేసిన జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్, స్వీట్ లస్సీల వంటివి అవాయిడ్ చేయాలి. ఇవి అనవసరమైన క్యాలరీలను పెంచేస్తాయ్. రక్తంలో షుగర్ స్థాయిని కూడా అధికం చేస్తాయ్. తస్మాత్ జాగ్రత్త.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com